screen-shot-2016-10-27-at-1-26-08-pm

సంస్కార్ ప్రకృతి ఆశ్రమం పరిచయం:
శ్రీ లవణం గారు, శ్రీమతి హేమలతా లవణం గారు గొప్ప సంఘ సంస్కర్తలు. ఈ దంపతులిద్దరూ నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో ఉంటూ నిజామాబాద్ జిల్లాలో ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుని, అనేక సంఘసేవా కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్జి ల్లాలో ఉన్న ‘జోగినీ’ దురాచార వ్యవస్థను, ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలను తొలగించి, ప్రజలను చైతన్యపరచి, దురాచారాలను పూర్తిగా నిర్మూలించగల్గారు. “ప్లాన్ ఇంటెర్నేషనల్” వారి ఆర్థిక సాయంతో అనేక గ్రామాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ మార్ని రామకృష్ణారావు సలహా మేరకు అక్బర్ నగర్అనే గ్రామంలో గ్రామస్థుల సహాయంతో ప్రకృతి ఆశ్రమాన్ని 1997 లో ప్రారంభించడం జరిగింది. 25 పడకల

ప్రకృతి ఆశ్రమం అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందినా, గ్రామంలో అవడం వల్ల ఆశించినట్లుగా ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకోలేక పోయారు. 9 సంవత్సరాల పాటు ప్లాన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ వారు ప్రకృతి ఆశ్రమ నిర్వహణకయ్యే ఖర్చులన్నింటికీ ఆర్థిక సాయం రూపంలో అందించడం వల్ల ఆశ్రమ నిర్వహణ ఇబ్బంది లేకుండా సాగిపోయింది. అయితే 2006 లో సంస్థ తో చేసుకున్న 9 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తి అయిపోవడం వల్ల వచ్చే రోగులు ఇచ్చే ఆదాయంతో ఆశ్రమం నిర్వహించడం కష్టం అయింది. పల్లెటూరు అవడం, మరియు 5-10 కి మించి రోగులు రాకపోవడం వల్ల ఆశ్రమ నిర్వహణ కష్టమయింది. ఆ సమయం లో శ్రీ లవణం గారి దంపతులు, మార్ని రామకృష్ణారావు గార్లు కలసి మంతెన సత్యనారాయణ రాజు గారికి ఈ ప్రకృతి ఆశ్రమం ఉచితంగా 33 సంవత్సరాల లీజు అగ్రిమెంటుతో అప్పగించడం జరిగింది. 2006 జూలై నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ‘సంస్కార్ ప్రకృతి ఆశ్రమం’ 25 నుంచి 50 పడకలు, 70 పడకలు, 2009
నాటికి 100 పడకల ప్రకృతి ఆశ్రమం గా అభివృద్ధి పరచడం జరిగింది. ఈ 100 పడకల ఆశ్రమానికి 100 మంది సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. సుమారు 5 ఎకరాల స్థలం లో పచ్చని చెట్లనీడలో, సహజసిద్ధమైన కొండ ప్రక్కన, ఏ విధమైన కాలుష్యం లేకుండా, ఆహ్లాదకరమైన వాతావరణం లో సహజంగా ఉన్న ఈ ప్రకృతి ఆశ్రమం ఆరోగ్యాభిలాషుల్ని ఆకర్షించేలా ఉంది. డా.రాజుగారు ఈ ప్రకృతి ఆశ్రమాన్ని పూలమొక్కలతో, పర్ణశాలలతో సంప్రదాయబద్ధమైన కట్టడాలతో ‘ప్రకృతి ఆశ్రమం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా తీర్చిదిద్దారు. ఈ సంస్కార్ ప్రకృతి ఆశ్రమ వాతావరణం అలా ఆహ్లాదకరంగా ఉండబట్టి ఎప్పుడూ ఒక్క బెడ్ ఖాళీ లేకుండా నాలుగైదు నెలలు అడ్వాన్స్ బుకింగ్ తో నడుస్తూ వస్తోంది.

శ్రీమతి & శ్రీ లవణం గారు స్వార్థరహితమైన జీవితం గడిపారు. వారి స్వంతానికి ఒక్కరూపాయి కూడా ఉంచుకోకుండా వందల కోట్ల రూపాయలు వారు సమాజ అభివృద్ధికి ఖర్చుపెట్టారు. సమాజంలో అందరినీ తమ పిల్లలుగానే భావించి వారికి సొంతపిల్లలు వద్దు అనుకున్నారు. వీరి వివాహం గాంధీ ఆశ్రమంలో జరిగింది. 48 సంవత్సరాలు కలసి ఉన్నారు. 2008 లో శ్రీమతి హేమలత లవణం గారు, 2015 లో లవణంగారు కాలం చేశారు. డా. రాజుగారు ఈ మారుమూల పల్లెటూరిలో ఆశ్రమం పెట్టడానికి కారణం ఇది.

వసతి సదుపాయాలు:

ఈ సంస్కార్ ప్రకృతి ఆశ్రమం అతి తక్కువ ఫీజులతో భారతదేశంలో మరెక్కడాలేనంత తక్కువధరలలో వైద్యసేవలందింస్తోంది. ఈ ఆశ్రమంలో ఆహారం(ఉదయం అల్పాహారంలో అయిదు రకాల మొలకెత్తిన విత్తనాలు, ఖార్జూరాలు, మధ్యాహ్న భోజనంలో పుల్కాలు, రెండు రకాల కూరలు, ముడిబియ్యం అన్నం, పెరుగు, సాయంత్రం 4-5 గంటల మధ్య పావులీటరు చెరకు రసం, డిన్నర్ లో అయిదు రకాల పండ్లు, మరియు ఉపవాసాలు చేసేటపుడు రోజుకి పావుకేజీ తేనె, నిమ్మకాయలు), ట్రీట్మెంట్లు(ఫుల్ బాడీ మసాజ్, పార్షియల్ మలాజ్, ఇమ్మర్షన్ టబ్స్, జిమ్ ఎక్విప్మెంట్స్, అండర్ వాటర్ మసాజ్, మడ్ బాత్, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్, యోగక్రియలు మొదలైనవి), రూమ్ రెంట్ అన్నీ కలిపి ఒక పాకేజీ లాగా ఫీజులు ఉంటాయి.

dsc_5021

రూమ్ ల వివరాలు:
జనరల్ రూమ్స్: రోజుకు ఒక మనిషికి అద్దె రూ. 500/-
రూముకి నాలుగు బెడ్ లు ఉంటాయి. ఒక బాత్రూమ్ వుంటుంది. మరికొన్ని రూమ్స్ లో ఆరేడుగురు
వుంటూ 2 – 3 బాత్రూమ్స్ వుంటాయి. ఇలాంటి జనరల్ రూమ్స్ సుమారు 50 పడకలు అందుబాటులో ఉన్నాయి.

కపుల్ రూమ్: రోజుకు ఒకమనిషికి అద్దె 600/-రూముకి రెండు బెడ్స్, మంచి ఫినిషింగ్ తో శుభ్రంగా ఉంటాయి. అటాచ్ద్ బాత్రూమ్ సదుపాయం ఉంటుంది. ఇటువంటి రూమ్ లు 12 అందుబాటులో ఉన్నాయి.

డీలక్స్ కపుల్ రూమ్: రోజుకు ఒకరికి అద్దె రూ. 800/- ఈ రూమ్స్ లో రెండు బెడ్స్, టాయ్లెట్, మంచి ఫ్లోరింగ్, వాల్స్ ఫినిషింగ్స్ తో శుభ్రంగా వుంటాయి. రూమ్కొం చం బాగుండాలనుకునేవారు ఈ రకమైన రూమ్స్ బుక్ చేసుకోగలరు. దంపతులిద్దరుగా వచ్చినవారు, స్నేహితులుగా ఇద్దరు, వేరేవారితో సంబంధం లేకుండా వీరిద్దరు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంటుంది. సింగిల్ గా వచ్చే మగ / ఆడవారు కానీ ఈ రూమ్స్ బుక్ చేసుకుంటే వేరొక మగ / ఆడవారితో పార్ట్నర్ షిప్ మీద ఉంచుతారు. ఈ రకమైన రూమ్స్ 8 మాత్రమే అందుబాటులో వున్నాయి.

ఎ.సి. కపుల్ రూమ్స్: రోజుకి ఒకరికి అద్దె రూ. 1000/-ఈ రూమ్ లో 2 బెడ్స్, టాయ్లెట్ మరియు చిన్న డ్రెస్సింగ్ రూమ్ ఉంటాయి. ఫ్లోరింగ్ మంచి టైల్స్ తోనూ, వాల్స్ ఫినిషింగ్ తో నీట్ గా ఉంటాయి. దంపతులు ఇద్దరూ వచ్చినపుడు కానీ, ఇద్దరు ఫ్రెండ్స్ కలసి వచ్చినపుడు కానీ ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఒక్కొరుగా చేరే మగవారు కానీ, ఆడవారు కానీ అలాగే బుక్ చేసుకున్న మరో మగ / ఆడవారికి పార్ట్నర్ షిప్ పైన ఈ రూమ్స్ ఏర్పాటు చేస్తారు. ఈ రూమ్స్ మొత్తం 6 అందుబాటులో వున్నాయి. ఎ.సి. మాత్రం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, రాత్రి 8 నుంచి 4 గంటల వరకు అందుబాటులో వుంటుంది.
ఎ.సి. జనరేటర్ మీద నడవదు. కరెంట్ వున్నపుడు మాత్రమే ఎ.సి. పనిచేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడూ ఎ.సి. వాడుకోకపోయినా పైన తెలిపిన రూమ్ రెంట్ మాత్రం నడుస్తుంది. ఎ.సి. కాటేజి : రోజుకి ఒకరికి అద్దె రూ. 1200/- ఈ రూమ్స్ లో రెండు బెడ్స్ ఉంటాయి. పెద్ద టాయ్లెట్, డ్రెస్సింగ్ రూమ్, వాకిట్లో విశాలమైన వరండా,
సిట్టింగ్ ఏర్పాటు, మంచి ఫ్లోరింగ్, లప్పమ్ ఫినిషింగ్ వాల్స్ తో చాలా నీట్ గా వుంటాయి. భార్యాభర్తలు
ఇద్దరూ కలసి వచ్చినపుడు కానీ, ఫ్రెండ్స్ ఇద్దరు కలసి వచ్చినపుడు ఈ కాటేజి బుక్ చేసుకోవచ్చు.
అలాగే ఒంటరిగా వచ్చే ఆడ / మగవారు కానీ ఈ కాటేజి బుక్ చేసుకుంటే అవకాశం వున్నపుడు వేరే
ఆడ / మగవారిని పర్ట్నర్ షిప్ మీద జతపరిచే అవకాశం వుంటుంది. ఈ కాటేజెస్ 3 మాత్రమే
అందుబాటులో వున్నాయి. ఇవే అన్నింటిలోకెల్ల ఖరీదైన శుభ్రంగా ఉండే వసతి. ఈ కాటేజెస్ వారు 15 రోజులకు బదులుగా కనీసం 10 రోజులకి డబ్బు కట్టాల్సి వుంటుంది. తక్కువ ఖర్చుతో ప్రకృతి విధానాన్ని
ఉపయోగించుకోవాలనే ఆరోగ్యాభిలాషులు విజయవాడ ఆరోగ్యాలయం బదులుగా ఈ ఆశ్రమం లో చేరగలరు.

రూమ్ రిజర్వ్ చేసుకోదలచిన వారు ఫోను చేసి రూమ్ వివరాలు, ఆరోగ్య సమస్యలు తెలిపితే ఒక రిజిష్టర్నం బర్ ఇస్తారు. మీ నంబర్ ప్రకారం ఖాళీ ఉన్న దానిని బట్టి మీకు రూమ్ అలాట్మెంట్ జరుగుతుంది.
సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో చేరాలి అంటే ముందుగా ఫోన్ చేసి నిర్ణయించుకున్న రూమ్ వివరాలు చెప్పి 15 రోజులకు అయ్యే ఛార్జీలు అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తే ఖాళీని బట్టి వెంటనే రూమ్ అలాట్ చేయడం కుదురుతుంది. అడ్వాన్స్ పేమెంట్ చేయకపోయినా ముందుగా ఫోన్ లో రూమ్ వివరాలు, జాయిన్ అయ్యే తేదీలు ఖచ్చితంగా చెప్పి జాయిన్ అయ్యే రోజున కనీసం 15 రోజుల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఫిబ్రవరి-ఆగష్ట్ ల మధ్య ఆశ్రమం రద్దీగా ఉంటుంది కనుక అడ్వాన్స్ పేమెంట్ చేసుకుని రూమ్ బుక్చే సుకోవడం మంచిది. మీరు అడిగిన వెంటనే రూమ్ దొరక్క వెయిటింగ్ వున్నప్పటికీ మీరు మధ్య మధ్యలో ఫోన్ చేసి మీ రిజిష్ట్రేషన్ నెంబర్ చెప్పి రూమ్ సమాచారం తెలుసుకోవచ్చు.

ఫోన్ నెంబర్లు : (08467) 284144, 284383 & 284088
8297447444, 8297887888
ఫోన్ పనిచేయు వేళలు: ఉదయం 6.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే
ఆశ్రమం అడ్రస్:
సంస్కార్ ప్రకృతి ఆశ్రమం,
డోర్ నంబర్: 2-8051
అక్బర్ నగర్ గ్రామం
బోధన్ వర్ని మండలం
నిజామాబాద్ జిల్లా-503188

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.