ఆశ్రమ నియమ నిబంధనలు:

1. ఆరోగ్యాభిలాషులు జాయిన్ అయిన దగ్గరనుంచీ, డిశ్చార్జ్ అయ్యేవరకు మధ్యలో బయటకు పంపించరు. మీరు మొత్తం అమౌంట్ కట్టి చేరినప్పటికీ ఏ కారణం చేతనైనా మధ్యలో వెళ్లవలసి వస్తే ఆ ఫీజు తిరిగి వెనక్కి ఇవ్వబడదు. మధ్యలో బయటకి పంపే అదికారం అక్కడున్న ఆశ్రమ నిర్వాహకులకెవరికీ లేదు.

2. 10 రోజులు గడిచిన తర్వాత డాక్టర్ సలహా మేరకు మీ స్టే పొడిగించుకోవచ్చు. నిజామాబాద్ ఆశ్రమంలో కనీసం 10 రోజుల పూర్తయిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులకు మాత్రమే డబ్బు తీసుకుని (మీ డిశ్చార్జీ డేట్ కు అయిదు రోజుల ముందు తెలియచేయవలసి ఉంటుంది) పొడిగింపు ఇస్తారు.

3. ఏ‌సి రూముల్లో ఉండేవారికి మధ్యాహ్నం 12-3 గంటల వరకు మరియు రాత్రి 8-ఉదయం 4 గంటల వరకు మాత్రమే ఏ‌సి లకు కరంట్ సప్లై ఉంటుంది. జనరేటర్ మీద ఏ‌సి ఆన్ చేయడం జరగదు. కరంట్ ఉన్నపుడు నిర్ణీత సమయాల్లో ఏ‌సి లకు కరంట్ సప్లై అందజేయబడుతుంది. ఏ‌సి వాడుకున్నా వాడుకోకపోయినా ఫీజు లో ఎటువంటి తగ్గింపు ఉండదు.

4. ఆశ్రమంలో ఉన్నంత వరకు ఎవరిద్వారానైనా ఆహార పదార్థాలు, సిగరెట్, మందు గుట్కా వంటి పదార్థాలు తెప్పించుకున్నట్టు కానీ, సేవించినట్టు కానీ తెలిస్తే 2,000/- పెనాల్టీ వేసి అదే రోజు ఆశ్రమం నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇవి తెప్పించుకునే విషయంలో ఆశ్రమ సిబ్బంది సహకరిస్తే వారి ఉద్యోగం పోతుంది. మీవెంట ఇటువంటి పదార్థాలు ఉన్నాయేమో అని బ్యాగులు ఆశ్రమంలోకి చేరిన రోజున శోధించబడతాయి. అలాగే మధ్యలో వచ్చిన మీ బంధువుల బాగ్ లు కూడా చెక్ చేస్తూ ఉంటారు. వీటికి ఆరోగ్యాభిలాషులు సహకరించాలి.

5. ఆశ్రమంలో ఉన్నఆడ /మగ వారు వేరే మగ/ఆడ వారితో పరిచయాలు ఎక్కవగా పెంచుకుని సన్నిహితంగా ఉండడం కానీ, ఒకరి గదులకు ఒకరు వెళ్ళడం కానీ, చెట్ల కింద ఎక్కువ సమయం గడపడం కానీ లేదా అక్రమ సంబంధాలు కలిగి ఉండడం కానీ గమనించినచో వారిద్దరికీ 2000/- పెనాల్టీ వేసి ఇంట్లోని వారికి సమాచారం అందించి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలు గమనించడానికి కొందరు ఆశ్రమ సిబ్బంది ఉంటారు. మొదట హెచ్చరిస్తారు అయినా మార్పు రాకపోతే సస్పెండ్ చేసి పంపుతారు.

6. 15 సంవత్సరాల లోపు పిల్లలు చేరాలి అనుకుంటే వారితో ఎవరైనా కుటుంబ సభ్యులు ఒకరు సహాయకులుగా రావాలి. ఆ వచ్చిన వారు కూడా నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.

7. ఆరోగ్యాలయం లో ఉన్నన్ని రోజులు క్లాసులకు, ట్రీట్మెంట్లకు, మంచిమాట అన్నిటికీ విధిగా హాజరు కావాలి. బాగా వృద్ధులకు రాత్రి ప్రసంగాలు రూమ్ లో కూర్చుని వినే మినహాయింపు ఉంటుంది కానీ మిగిలిన వయసు వారందరూ విధిగా హాజరు కావాలి.

8. తప్పని సరి అవసరం ఉన్నవారికి తప్ప మిగిలిన వారికి ల్యాప్ ట్యాప్ లు అనుమతించబడవు.

9. స్త్రీల ఆభరణాలు, ప్రయాణంలో తినగా మిగిలిన ఆహార పదార్థాలు ఆశ్రమంలోనికి అనుమతించరు.

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.