శ్రీ డా గోకరాజు గంగరాజు గారి గురించి


శ్రీ గోకరాజు గంగరాజు ఒక పారిశ్రామికవేత్త. ‘కెమిలాయిడ్స్’ అనే ఆయుర్వేద ఔషదాలు తయారుచేసే సంస్థ, చక్కెర కర్మాగారాలు, ‘ఆశ్రమ్ వైద్య కళాశాల, ఏలూరు’, ‘శ్రీ గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కళాశాల, హైదరాబాదు’, ఎం. ఫార్మసీ, ఎం‌సిఎ కళాశాలలు స్థాపించి విద్యా, వ్యాపార రంగాల్లో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. సమాజాసేవ చేయాలనే దృఖ్పదం తో ఎన్నో ఆశ్రమాలకి, సంస్థలకి స్థలాలను విరాళంగా ఇవ్వడమే కాకుండా కొన్ని సంస్థలకి ట్రస్టీగా, ఛైర్మన్ గా సేవలు కూడా అందిస్తున్నారు. చిన్నజీయర్ స్వామివారు స్థాపించిన ‘జెట్’ (జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్), కృష్ణానది వడ్డున నిర్మింపబడిన ‘ఇస్కాన్ టెంపుల్ కు’, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కు, పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, ‘ఆక్వా డెవిల్స్ అసోసియేషన్’ వారికి విరివిగా స్థలాలను ఇచ్చారు.

“డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు ట్రస్ట్” కి గోకరాజు రంగరాజు గారే ప్రేరణ. విజయవాడలో ఆశ్రమం నిర్మాణానికి 18 ఎకరాలు స్థలం
కొని ఇవ్వడమే కాకుండా,18 కోట్ల బ్యాంకు లోనుకు గ్యారంటీ సంతకం పెట్టడం, ఆశ్రమానికి ఆయన పేరు కాకుండా సత్యనారాయరాజు గారి పేరు పెట్టాలని పట్టుబట్టడం ఆయన సేవా దృఖ్పదానికి ఉదాహరణలు. విజయవాడ ఆరోగ్యాలయానికి అడుగడుగునా అండగా ఉంటూ మంతెన సత్యనారాయణగారిని ముందుకు నడిపిస్తూ ఆరోగ్యాలాభిలాషులకు సేవలందించడం లో ఆయన సేవ అమోఘం.

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.