screen-shot-2016-10-27-at-1-26-08-pm

వసతి సదుపాయాలు మరియు ధరల వివరాలు :

చాలా ప్రకృతి ఆశ్రమాలలో రూమ్ రెంట్, ట్రీట్మెంట్ చార్జెస్ మరియు డైట్ చార్జెస్ విడి విడిగా వసూలు
చేయబడతాయి, కానీ ఈ ఆరోగ్యాలయంలో ఒక ప్యాకేజీలోనే అన్ని సదుపాయాలు కలుగజేయబడతాయి. వసతి సదుపాయాలు.

నాన్ ఎ.సీ రూముల వివరాలు :

2. ఫ్యామిలీ రూమ్ :
నాన్ ఎ.సి ఫ్యామిలీ అకామోడేషన్: రూ. 26,000/- (30 రోజులకి ఒక్కరికి)

ఈ సదుపాయం 15 రోజులు ఉండేవారు ఒక్కరు రూ. 15,000/- చెల్లించవలసి వుంటుంది. ఈ రూంలో 4 బెడ్లు, రెండు బాత్రూంలు మరియు విడిగా వాష్ ఏరియా, కబోర్డులు, బాల్కనీలో
కూర్చోడానికి సదుపాయాలు, హ్యాంగింగ్ చైర్ ఉంటాయి. ఒకే ఫ్యామిలి మెంబర్స్(ఆడ, మగ కలసి ఉండవచ్చు) నలుగురు వచ్చినా లేదా నలుగురు ఫ్రెండ్స్ కలసి వచ్చినా అందరూ ఒకే చోట
ఉండదలుచుకుంటే ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. లేనిపక్షం లో, నలుగురికి విడివిడిగా, ఒకే ఏజ్ గ్రూప్ వారికి ఇవ్వబడుతుంది. మగవారికి, ఆడవారికి విడివిడిగా ఈ
సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

3. నాన్ ఎ.సి కపుల్ రూమ్: రూ. 30,000/- (30 రోజులు ఒక్కొక్కరికి)రూ. 17,000/- (15 రోజులు ఒక్కొక్కరికి)

ఈ రూమ్ లో రెండు బెడ్స్ ఉంటాయి. అటాచ్ద్ టాయ్లెట్, రెండు కబోర్డులు, బాల్కనీ, హ్యాంగింగ్ చైర్, కూర్చునేందుకు ఏర్పాటు చేయబడ్డాయి. భార్యాభర్తలు మాత్రమే కలసి చేరదల్చినపుడు నాన్
ఎ.సి. లో కావాలంటే ఈ ఒక్క అకామోడేషన్ తీసుకోవలసి ఉంటుంది. విడివిడిగా వచ్చిన మగ లేదా ఆడ ఇద్దరికీ కలిపి 15 రోజులు, 30 రోజులు కానీ ఈ సదుపాయం ఇవ్వబడుతుంది. (ఒకే
ఏజ్ గ్రూప్ వారిని ఇంకొకర్ని కలుపుతారు).

ఎ.సి. రూమ్ లు వివరాలు

1. ఎ. సి. ఫ్యామిలి రూమ్: రూ. 34,000/- (30 రోజులకి ఒక్కొక్కరికి)రూ. 19,000/-(15 రోజులకి ఒక్కొక్కరికి)

ఈ రూమ్ లో మూడు బెడ్లు, మూడు కబోర్డులు, రెండు టాయిలెట్లు, వాష్ ఏరియా మరియు ఫాల్స్ రూఫ్(ఏ.సి. కొరకు), బాల్కనీ లో కూర్చునే ఏర్పాటు మరియు హ్యాంగింగ్ చైర్
వుంటాయి. ఈ రూమ్ ని ఒకే ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు (ఆడవారైనా/మగవారైనా) కలసి వచ్చినపుడు ఉండే సదుపాయం ఉంటుంది. అనుకోకుండా 4 ఫ్యామిలీ మెంబర్స్
ఉన్నప్పుడు/ వచ్చినపుడు కూడా 4వ బెడ్ ఏర్పాటు చేయబడుతుంది. ఇవి విడివిడిగా వచ్చే ఆడవారు కానీ, మగవారు కానీ ఏ.సి. సదుపాయం తక్కువ రేటులో
కావాలని కోరుకునేవారికి ఈ అకామోడేషన్ ఒకే ఏజ్ గ్రూప్ వారికి కేటాయించబడుతుంది.

2. ఎ.సి. కపుల్స్ రూమ్స్: రూ. 38,000/- (30 రోజులకు ఒక్కరికి)రూ. 21,000/- (15 రోజులకు ఒక్కరికి)

ఈ రూంలో 2 బెడ్లు, 2 కబోర్డులు, 1 టాయ్లెట్, 1 కేన్ చైర్, సెంటర్ టేబుల్, ఫాల్స్ రూఫ్(ఎ.సి. కొరకు), బాల్కనీ లో కూర్చునే ఏర్పాటు మరియు హాంగింగ్ కేన్ చైర్ ఉంటాయి.
భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే చేరేటపుడు ఎ.సి. సదుపాయం కావాలంటే, ఈ రూమ్స్ మాత్రమే బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ రూమ్స్ కి ఒంటరిగా చేరే మగవారికి లేదా ఆడవారికి ఆ
ఏజ్ గ్రూప్ వేరే ఆడ/మగ వారితో పార్టనర్షిప్ లో కలసి ఉండే ఏర్పాటు చేస్తారు.

3. సింగల్ ఎ.సి. రూమ్: రూ. 52,000/- (30 రోజులకు ఒక్కొక్కరికి) రూ. 28,000/- (15 రోజులకి ఒక్కొక్కరికి)ఇది సింగిల్ గా ఉండదల్చిన ఆడవారికి, మగవారికి, వేరే ఎవ్వరితోటి కలసి ఉండలేం అనుకుని ఒంటరిగా రూమ్ తీసుకో దలిస్తే ఈ రూమ్స్ కేటాయించ బడుతాయి. ఇందులో ఒక బెడ్, 2 కబోర్డులు, కేన్ చైర్, సెంటర్ టేబుల్, ఒక టాయిలెట్, బాల్కనీ లో కూర్చునే సదుపాయం మరియు కేన్ హ్యంగింగ్ చైర్ ఉంటాయి. పైన ఉదహరించిన రేట్లు కేవలం రూమ్ రెంట్స్ మాత్రమే కాదు. మొత్తం ప్యాకాజీ అంటే ఇందులోనే వసతి సదుపాయం, మూడు పూటలా భోజన సదుపాయం, రెండు పూటలా ఇచ్చే ట్రీట్మెంట్స్, యోగాసనాలు, డాక్టర్ కన్సల్టేషన్, స్విమ్మింగ్, ఉపవాసాల సమయం లో పావు కేజీ తేనె మరియు ఫాస్టింగ్
విరమించినపుడు నాలుగు సార్లు జ్యూసులు, హెల్త్ లెక్చర్స్, బస్టాండు, రైల్వే స్టేషన్ లో పికప్ మరియు డ్రాపింగ్ కారు తో అన్నీ ఇందులో కలసి ఉన్నాయి.

4. సూట్స్/స్పెషల్ రూమ్స్: (రూ. 3000/- రోజుకి ఒకరికి)
ఇందులో కనీసం పది రోజులు ఉండవలసి ఉంటుంది. అక్కడ్నుంచి ఎన్ని రోజులుంటే అన్ని రోజులకి రోజుకి రూ. 3000/- చొప్పున చార్జ్ చేస్తారు. సూట్స్ 5 వ అంతస్తు లో ఉంటాయి. ఒక పెద్ద బెడ్రూం, ఒక చిన్న
లివింగ్ రూమ్, పెద్ద టాయ్లెట్, వాష్ ఏరియా, హ్యంగింగ్ చైర్ ఉంటాయి. ఈ సూట్స్ ఫాల్స్ రూఫ్, మొత్తం కేన్ ఫర్నిచర్ తో ఏర్పాటు చేయబడి ఉంటుంది. 5 వ అంతస్తులో అంతా 12 సూట్స్ ఉంటాయి.

1. ఇందులో దంపతులిద్దరూ కానీ లేదా ఇద్దరు స్నేహితులు కానీ కలసి ఉండవచ్చు.
2. సూట్స్ మొత్తం సింగిల్ పర్సన్ బుక్ చేసుకోవాలంటే రూ. 3,000/- ఒక్కో రోజుకి ఇవ్వాల్సి ఉంటుంది. అపుడు వేరెవ్వరితో పార్ట్నర్ షిప్ ఉండదు.
3. ఒకే ఫ్యామిలి మెంబర్స్ వచ్చినా లేదా పేరెంట్స్/పెద్దవాళ్లతో చిన్నపిల్లలు వచ్చినా అలా 3 బెడ్స్ ఉండే సూట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూ. 1,500/- మూడవ బెడ్ కి చార్జి చేస్తారు.

ఆరోగ్యాలయం లో పండుగ వేడుకలు:

మీకు 15 – 30 రోజుల క్యాంప్ లో బుకింగ్ చేసుకునే సమయంలో మధ్యలో ఏ పండుగలైనా వస్తే పండుగలకి ఇంట్లో వుండకుండా మిస్ అవుతాం అనుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ అందరూ డా. రాజుగారి దంపతులతో కలసి పండుగ వేడుకల్ని ఇంటి దగ్గర కంటే చాలా బాగా జరుపుకోవచ్చు. ప్రతి పండుగనీ ఆరోగ్యాలయంలో సాంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేసి పండుగ విష్టతను అర్థంతో వివరిస్తూ మీ అందరూ ఆ వేడుకను జరుపుకునేటట్లు అవగాహన కల్పించి, మీ అందరి సహకారంతోనే ఆశ్రమం లో ప్రకృతి పద్ధతిలోనే తినుబండారాలు అందరూ కలసి సిద్ధం చేసుకుని అలానే అందరూ కలిసి పంక్తి భోజనం చేసే ఏర్పాటు చేస్తారు. పండుగ రోజుల్లో అరిటాకులు వేసి భోజనాలు పెట్టి 7, 8 రకాలైన తినుబండరాలను భోజనాలలో వడ్డించి భోజనానంతరం తాంబూలం అందించి ఆడవారందరికీ పూలు అవీ అందించి రకరకాలైన వినోదభరితమైన ఆటలు ఆడించి, రాత్రికి సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఉగాది, వినాయకచవితి, శ్రీకృష్ణాష్టమి, కార్తీకమాస స్నానాలు, ధనుర్మాస స్నానాలు, దీపావళి, దసరా, సంక్రాంతి
పండుగలలో చేశారు. దీపావళికైతే అందరూ ఇష్టపడే టపాకాయలు / సామాగ్రి తెప్పించి ప్రతి ఒక్కరికీ అందించి వేడుక జరిపిస్తారు. కనుక బుకింగ్ చేసుకునే సమయాన్ని పండుగల కారణంగా వాయిదా వేసుకోనవసరం లేదు.

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.