ఆరోగ్య శిబిరం
30 రోజుల క్యాంపు:

ప్రతినెల 1వ తేదీన ప్రారంభమై, 30వ తేదీతో ముగుస్తుంది. 1వ తేదీ తెల్లవారుఝాము నుంచి, సాయంత్రం 6 గంటల లోపు రావచ్చు. ఈ ౩౦ రోజుల క్యాంపులో చేరటానికి బుక్ చేసుకోవాలను కునేవారు కొన్ని కారణాల వల్ల 1వ తేదీన చేరలేక పోయినా ఒకటి రెండు రోజులు ఆలస్యంగా రావచ్చు. నష్ట పోయిన 2 – 3 రోజులు మరుసటి నెలకి కేటాయించ బడవు. 30వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం లోపు డిశ్చార్జీ అవ్వాల్సి ఉంటుంది.

16 వ తేదీ నుండి తదుపరి నెల 15 వరకు:

ఇలా 1వ తేదీ నుండి 30వ తేదీ వరకూ కుదరనివారు, 30 రోజుల పాటు చేరదల్చుకుంటే ప్రతి నెల 16 నుండి మరుసటి నెల 15 వరకూ చేరవచ్చు.

30 రోజుల శిబిరం ప్రయోజనాలు:

నెలరోజుల పాటు మంచి వాతావరణంలో మంచి అలవాట్లతో, క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం అలవాటు చేసుకోవడానికి, దీర్ఘ ఉపవాసాలు బాగా చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, 30 రోజులు డాక్టర్ రాజుగారి ఆరోగ్య ప్రసంగాలు వినడానికి, మానసిక పరివర్తన జరగడానికి, ఉప్పు, నూనెల్లేని వంటల్ని రుచికరంగా తయారు చేసుకోవడం నేర్చుకోవడానికి, ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన కలగడానికి ఈ 30 రోజుల క్యాంప్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

ఆరోగ్య శిబిరం
45 రోజుల క్యాంపు లేదా 60 రోజులు:

దీర్ఘరోగాలున్న వారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తీసుకుంటూ ఎక్కువ సంవత్సరాల నుంచి బాధపడేవారికి పూర్తిగా ఇన్సులిన్ తీసుకోకుండా తగ్గాలన్నా, కీళ్లనొప్పులతో బాగా ఇబ్బంది పడేవారు అలాగే రుమటాయిడ్ ఆర్థరైటస్ తో బాధపడేవారు ఆ నొప్పులు బాగా తగ్గించుకోవాలన్నా, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధుల్ని దీర్ఘ ఉపవాసాలతో తగ్గించుకోవాలనుకున్నా, అధిక బరువు ఉండి ఎక్కువైన బరువును తగ్గించుకోవాలనుకున్నా, సంతాన సమస్యలు, PCOD సమస్య ఉన్న వారికి ఈ 45 రోజుల క్యాంప్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ సంవత్సరాల నుంచి జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు దీర్ఘ ఉపవాసాల ద్వారా పొట్ట ప్రేగుల్ని శుద్ధి చేసుకుని అన్ని ఆహార పదార్థాలు అరిగేటట్లు చేసుకోవడానికి ఈ 45 రోజుల క్యాంప్ ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ఏమైనా ఉన్నప్పటికీ, 30 రోజుల క్యాంప్ కి బదులుగా ఇలా ఎక్కువ రోజుల క్యాంప్ లాభదాయకం గా వుంటుంది. ముందుగా వీరు 30 రోజుల క్యాంప్ నగదుకట్టి చేరి తర్వాత 45 రోజుల లేక 60 రోజులకు కానీ పొడిగించుకోవచ్చు.

ఇలా 30 రోజుల క్యాంప్ కి వచ్చి పొడిగించుకోవాలంటే మరో 15 లేదా 30 రోజులకి మాత్రమే ఇస్తారు తప్ప అంతకు తక్కువ రోజులకి ఇవ్వబడదు. ఒక వారం కానీ, 4 – 5 రోజులు కానీ, 7 – 8 రోజులకి కానీ 15 రోజుల డబ్బు కట్టి చేరవచ్చు. ఈ పొడిగింపు మాత్రం మీ వ్యక్తిగత ప్రవర్తన, క్రమశిక్షణ బాగుండి ఆశ్రమ నియమనిబంధనల్ని మరియు ఇక్కడ జరిగే ప్రసంగాలను క్రమం తప్పకుండా వింటూ, బాగా శ్రద్ధ కలిగినవారికి మాత్రమే ఇవ్వబడతాయి. లేని పక్షం లో పొడిగించమని అడిగినా ఇవ్వరు.

15 రోజుల క్యాంపు:

ప్రతినెల 1వ తేదీ ప్రారంభమై 15వ తేదీ కి వెళ్లవలసి ఉంటుంది. అలాగే 16 నుండి 30 వరకు రెండవ బ్యాచ్ ఉంటుంది. దాంట్లోనూ జాయిన్ అవవచ్చు. ఈ 15 రోజుల క్యాంప్స్ లో చేరదల్చినవారికి కొన్ని రకములైన వసతి సదుపాయాలే కేటాయించబడతాయి. నాన్ ఎ.సి. కపుల్ రూమ్, (రూ.17,000/- 15 రోజులకు ఒక్కరికి) మాత్రమే.

ఎ.సి. లో అయితే ఎ.సి. ఫ్యామిలీ అకామోడేషన్ 19,000/- (ప్రతి ఒక్కరికి 15 రోజులకు) ఎ.సి. సింగిల్ రూమ్ రూ. 31,000/- (ఒక్కొక్కరికి 15 రోజులకు) లేదా

ఎవరికైతే 30 రోజులపాటు చేరటానికి వీలుపడదో అలాంటివారు 15 రోజుల పాటు చేరవచ్చు. ఈ 15 రోజుల వ్యవధిలో అన్నీ పూర్తిగా నేర్చుకోవడం సాధ్యపడదు కానీ అన్నీ కొంతవరకు మాత్రం అవగాహన కల్గుతాయి. 15 రోజుల్లో 6 – 7 రోజులు ఉపవాసాలు చేయిస్తారు. ఒక్కరోజు జ్యూస్ ఫాస్టింగ్, ఒక్కరోజు ఫ్రూట్ ఫాస్టింగ్ కూడా చేయిస్తారు. రోజూ మసాజ్, ఎనీమా, స్టీమ్ బాత్, శాండ్ బాత్ మొదలైన వాటి ద్వారా బాడీ సర్వీసింగ్ అవుతుంది. వంటల క్లాసులు గానీ, ఆరోగ్య ప్రసంగాలు గానీ కొంతవరకు అవగాహనకు వస్తాయి. సమస్యలు15 రోజుల్లో పూర్తిగా పోకపోయినప్పటికీ ఇంటికి వెళ్ళాక ఇక్కడ నేర్చుకున్న దానిని కొనసాగిస్తూ పూర్తిగా పోగొట్టుకునేటట్లుగా అవగాహన కల్గిస్తారు.

ఆరోగ్య శిబిరం
మధుమేహం క్యాంప్:

మధుమేహం ని పూర్తిగా మాత్ర లేకుండా తగ్గించుకోవాలనుకుంటే, పండ్లు/ స్వీట్స్ తిన్నా తిరిగి మధుమేహం రాకూడదు అని కోరుకునేవారు ఈ 30 రోజుల క్యాంప్ లో పూర్తి అవగాహనతో ఇతర ఆరోగ్య సమస్యలను తొలగించుకుంటూ షుగర్ వ్యాధిని పోగొట్టుకోవచ్చు. 30 రోజుల క్యాంప్ లో షుగర్ తగ్గించడానికి ప్రత్యేకమైన యోగాసనాలు, ప్రత్యేకమైన ఆహార నియమాలు, ప్రత్యేకమైన అవగాహన క్లాసులు, ఇంటికి వెళ్ళిన తరువాత ఆచరించవలసిన జీవన విధానం పూర్తిగా నేర్పిస్తారు. మరలా జీవితంలో మధుమేహం రాకుండా నేర్పిస్తారు. అలాగే మధుమేహం లేనివారికి భవిష్యత్తులో వంశపారంపర్య(హెరిడిటరీ) గా రాకూడదు అనుకునేవారికి 30 రోజుల క్యాంపు లాభదాయకం.

ప్రతినెల జరిగే 30 రోజుల ఊబకాయం శిబిరం మరియు షుగర్ శిబిరాలు ప్రత్యేకత:

అధిక బరువు: ప్రతినెల ఇవి జరుగుతూ ఉంటాయి. ఒకటవ తేదీ నుండి 30 వరకూ, 16 వ తేదీ నుండి మళ్ళీ 15 వరకూ జరుగుతూ ఉంటాయి. కనుక ఈ రెండు బ్యాచ్ లలో మీ అనుకూలతని బట్టి ఎప్పుడైనా చేరవచ్చు.

అధిక బరువుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయి.ఇతర ఊబకాయం సెంటర్లలో లా కాకుండా ఇక్కడ చికిత్సలు మరియు ఆహారానియమాల వల్ల బరువుతో పాటు షుగర్, బి.పి., ఆస్త్మా, కీళ్లనొప్పులు, చర్మవ్యాధులు, కొలెస్ట్రాల్, మలబద్ధకం, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత, తలనొప్పి, లివర్ సమస్యలు వీటిలో ఏవి వున్నా, అవన్నీ కూడా తగ్గుతాయి. సగటు నెలకి 7 – 8 కేజీల నుంచి 10 – 12 కేజీల వరకూ బరువు తగ్గవచ్చు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక బరువు పెరగకుండా మిగిలిన బరువుని పూర్తిగా ఎలా తగ్గించుకోవాలో, బాడీ స్లిమ్ గా ఎలా తయారుచేసుకోవాలో, ఏ ఆహారం తినాలో, ఏది తినకూడదో, ఏ ఆహారం లో ఎంత శక్తి ఉంటుందో, ఏ పనికి ఎంత శక్తి ఖర్చు అవుతుందో ఇలాంటి విషయాలన్నీ డాక్టర్ రాజుగారి ఉపన్యాసాలో పూర్తి అవగాహన కలుగుతుంది.

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.