రూమ్ రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి?

1. ప్రతినెల జరిగే 15 రోజుల క్యాంప్ లేదా 30 రోజుల క్యాంప్ లో చేరదలచిన వారు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూమ్   రిజర్వ్  చేసుకుని ప్రతినెల ఒకటవ తేదీన కానీ లేదా 16 వ తేదీన కానీ జాయిన్ అవ్వచ్చు. బుకింగ్ వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెం. : 0863 – 2333888 ఉదయం 6.30 నుండి సాయంత్రం 8.30 వరకు మాత్రమే పైన తెలిపిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు నిర్ణయించుకున్న రూమ్ వివరాలు చెప్పి, ఆ మొత్తాన్ని మీరు బ్యాంకులో ఆన్లైన్ ద్వారా ఒకటి లేదా రెండు రోజుల్లోనే చెల్లించగలిగే పక్షంలోనే మా ఆన్లైన్ బ్యాంకు అకౌంటు నెంబర్ మీకు తెలియజేస్తారు. మీరు ఆ డబ్బు చెల్లించిన తరువాత మరలా మీరు ఫోన్ చేసి జమకట్టిన వివరాలు తెలిపితేనే మీకు రూమ్  రిజర్వ్ చేయబడుతుంది. దగ్గర ప్రాంతాలవారు ఆశ్రమానికి స్వయంగా వచ్చి తగినంత డబ్బు చెల్లించి రూమ్  రిజర్వేషన్ చేసుకుని రశీదు పటుకెళ్లవచ్చు. ఒకవేళ ఒకటి, రెండు రోజుల్లో చెల్లించలేని పక్షం లో రెండురోజుల తర్వాత మా ఆఫీస్ నుండి ఫోన్ చేసి మీతో మాట్లాడి అవకాశాన్ని బట్టి మరికొంత వ్యవధి ఇవ్వడం జరుగుతుంది.

2. ఈ రూమ్ రిజర్వేషన్ ప్రతినెల 1వ తేదీన మొదలయ్యే క్యాంపు కు గానీ, 16వ తేదీ దానికి గానీ రెండు, మూడు నెలలు ముందుగానే మీకు కావల్సిన తేదీలకు అడ్వాన్స్  రిజర్వేషన్ చేసుకోవచ్చు. త్వరగా బుక్ చేసుకోవడం వల్ల కోరుకున్న రూమ్ దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. సమయం దగ్గరపడినతరువాత బుక్ చేసుకుంటే దొరికిన వాటిలో అడ్జస్ట్ అవ్వవలసి వస్తుంది.

3. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీరు 15 రోజులు లేదా 30 రోజుల క్యాంప్ కి రిజెర్వ్ చేసుకున్న తరువాత ఏ కారణం చేతనైనా ఆ తేదీకి మీరు జాయిన్ అవ్వడం కుదరకపోతే మీరు కనీసం వారం రోజులు ముందు తెలియజేసిన పక్షం లో మీ బుకింగ్ తేదీని మీరు కోరిన నెలకి ఏ విధమైన పెనాల్టీ లేకుండా మార్చబడుతుంది. ఇలా సంవత్సరం లో ఎప్పుడైనా, 3 సార్లు వాయిదా వేసుకోవచ్చు. మీరు జాయినింగ్ తేదీ రోజున రిపోర్ట్ చేయలేకపోయినా లేదా తేదీకి ఒకటి రెండు రోజుల ముందు వాయిదా/ రద్దు అడిగితే మాత్రం వారం రోజుల డబ్బుని పెనాల్టీ క్రింద మినహాయించి మిగతా డబ్బుని వెనక్కి ఇవ్వడమో లేదా మీరు కోరిన తేదీకి సర్దడమో జరుగుతుంది. అడ్వాన్స్ గా నెల, రెండు నెలల ముందే మీరు డబ్బు కట్టి మీ రూమ్ రిజర్వ్ చేసుకుని, ఏ కారణం చేతనైనా మీరు పూర్తిగా రద్దు చేసుకోదలిస్తే, అపుడు మీరు కట్టిన డబ్బు మొత్తం ఏ విధమైన పెనాల్టీ లేకుండా వాపసు చేయబడుతుంది.

మీరు ఎలా రావాలి ?

రైలు లేదా బస్సులో వచ్చేవారికి:

ఒకటవ తేదీ కానీ, 16వ తేదీ కానీ మీరు చేరడానికి వచ్చేటప్పుడు తెల్లవారుఝామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే మా కార్లు ఉచితంగా మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఏర్పాటు చేయబడతాయి. మీరు మా వాహనాలు తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి మరియు బస్ స్టాండ్ లో ఒక వ్యక్తి మన ఆరోగ్యలయం ప్లకార్డ్ పట్టుకుని వుంటారు. వారు ఎక్కడ ఉన్నదీ తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వచ్చిన వారు 9848615111 కి, బస్ స్టాండుకి వచ్చిన వారు9848615222 కి ఫోన్ చేసి వాహన వివరాలు పొందవచ్చు.

1వ తేదీ, 16వ తేదీ కాకుండా మీకు ఒకటి, రెండు రోజులు ఆ తేదీలు దాటాక బస్ లో కానీ, రైలు లో కానీ వస్తే మిమ్మల్ని తీసుకురావడానికి సంప్రదించండి 9848617222. అలాగే మీరు 15/ 16 తేదీల్లో వెళ్లదలచిన వారికి లేదా 29/ 30 తేదీల్లో వెల్ల దలచిన వారికి ఆరోగ్యాలయ సంబంధిత వాహనాల ద్వారానే ఉచితంగా మిమ్మల్ని బస్టాండు / రైల్వే స్టేషన్లో దించడం జరుగుతుంది.

సొంత వాహనాలలో వచ్చేవారు కి(కారు) రూట్ మ్యాప్

హోటల్ లోటస్ ల్యాండ్ నుంచి 4 కి.మీ.
విజయవాడ నుండి ఒక రూట్ మ్యాప్
గుంటూరు, నెల్లూరు, బెంగుళూరు నుంచి ఒక రూట్ మ్యాప్ వయా మంగళగిరి
రూట్ మ్యాప్ (ఉండవల్లి సెంటర్) సీతానగరం / ప్రకాశం బ్యారజి
కారులో వచ్చేవారిని కూడా ఉదయం 5 నుండి రాత్రి 10 లోపు రావలసి ఉoటుoది
ఏదైనా అవాంతరం, ఇబ్బంది వల్ల ఆలస్యమయితే ఫోన్ నెం. 0863 – 2333888 ద్వారా
సంప్రదించగలరు.

ఎయిర్ పోర్ట్ నుండి వచ్చేవారు ఆశ్రమానికి రావటానికి మరియు తిరిగి వెళ్ళటానికి ఆరోగ్యాలయానికి సంబంధించిన వాహనాలని ఏర్పాటు చేయటం కుదరదు. ఆరోగ్యాలయానికి తెలిసిన ట్రావెల్ ఏజెంట్స్ మీ అనుమతితో మేము బుక్ చేసిపెట్టగలం. మీరు డయల్ చేయవలసిన నెం. 9848617222. మీరు నామినల్ చార్జెస్ స్వయంగా చెల్లించి భద్రతలో ఆశ్రమానికి చేరుకోగలరు.

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.