[rev_slider_vc alias=”home-slider”]

  • సహజమైన ఆరోగ్యం మన సొంతం. మంచి ఆహార అలవాట్లతో, చక్కటి దినచర్యతో ఆరోగ్యం సాధించడం సులభం.

  • సంప్రదాయమైన, అనుభవైద్యమైన ప్రకృతి వైద్య విధానం అవలంబించడమే ఆరోగ్యాన్ని స్వాగతించడం.

మంతెన సత్యనారాయణరాజు

ఆరోగ్యాలయం

ఆరోగ్యాలయ లక్ష్యం

ఎటువంటి మందులు వాడకుండా ప్రకృతి జీవన మరియు ప్రకృతి వైద్య విధానాల ద్వారా అన్నిరకాల ఆరోగ్య సమస్యలను నిర్మూలించడమే ఈ ఆరోగ్యాలయ లక్ష్యం. ఈ ఆరోగ్యాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య, నిపుణులు అనుభవజ్ఞుల సహకారంతో డా. మంతెన సత్యనారాయణరాజు ఆయన సతీమణి డా. విశాల గారి పర్యవేక్షణలో ప్రతీ ఆరోగ్యాభిలాషికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రకృతి వైద్యవిధానం ఆధారంగా అనారోగ్యాన్ని నిర్మూలించడం, ఆరోగ్యాన్ని పరిరక్షించడం జరుగుతాయి.

ట్రస్ట్ కార్యకలాపాలు

మంతెన సత్యనారాయణరాజు ఛారిటబుల్ ట్రస్టు ప్రకృతి ఆశ్రమాలను (నేచర్ క్యూర్ హాస్పిటల్స్) అభివృద్ధి చేయడం, నడపడం/నిర్వహించడం, ఆరోగ్య విషయాలను ప్రచారం చేయడం, ప్రకృతి వైద్య శాస్త్రము లో వుండే ఆరోగ్య రహస్యాలను పరిశోధన చేసి శాస్త్రీయ గా రుజువు చేయడం, అవకాశం వుంటే భవిష్యత్తులో ప్రకృతి వైద్య కళాశాలను అభివృద్ధి చేయడం మొదలగునవి చేస్తూ ఉంటుంది.

ట్రస్టు గురుంచి

డా. రాజు గారి జీవన పయనం

2000-2008 మధ్య దూరదర్శన్ లోనూ, ఈటీవీ సుఖీభవలో అప్పుడప్పుడూ, కార్యక్రమాలు అందించిన రాజుగారు ‘మాటీవీ’ కి “మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే” అనే శీర్షికన 800 భాగాలు, అదే సమయంలో ఐ న్యూస్ ఛానెల్ కి 15 నిమిషాలు భాగాలు 360 “జీవన రహస్యాలు” అందించారు. 2009 లో లవణం గారితో అప్పగించబడిన “సంస్కార్ ప్రకృతి ఆశ్రమం” ను, 2010 నుంచి విజయవాడ ఆరోగ్యాలయ నిర్మాణంలో, నిర్వహణలో అలసట లేకుండా ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు.

డా. రాజు గారు గురుంచి

ఆరోగ్యాలయ శిబిరాలు

ప్రతి మానవుడి సాధారణ కోరిక ఎప్పుడూ ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన శరీరం కలిగి ఉండటము. దానిని సాధించటానికి, మన జీవితాల్లో ఒక క్రమబద్ధమైన దినచర్య పాటించవలసి ఉన్నది. ఆరోగ్యాలయము వద్ద, ప్రతి వ్యక్తి మీద కావలసినంత జాగ్రత్త మరియు శ్రద్ధ తో ప్రకృతి నివారణ చికిత్స అందించ పడుతుంది.

  • ఊబకాయం శిబిరం

    ప్రతినెల ఇవి జరుగుతూ ఉంటాయి. సగటు నెలకి 7 – 8 కేజీల నుంచి 10 – 12 కేజీల వరకూ బరువు తగ్గవచ్చు. అధిక బరువుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయి.

  • 15 రోజుల శిబిరం

    ప్రతినెల 1వ తేదీ ప్రారంభమై 15వ తేదీ కి వెళ్లవలసి ఉంటుంది. అలాగే 16 నుండి 30 వరకు రెండవ బ్యాచ్ ఉంటుంది. దాంట్లోనూ జాయిన్ అవవచ్చు. ఈ 15 రోజుల శిబిరం లో చేరదల్చినవారికి కొన్ని రకములైన వసతి సదుపాయాలే కేటాయించబడతాయి.

  • 30 రోజుల శిబిరం

    నెలరోజుల పాటు మంచి వాతావరణంలో మంచి అలవాట్లతో, క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం అలవాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

  • మధుమేహం శిబిరం

    30 రోజుల  శిబిరం లో షుగర్ తగ్గించడానికి ప్రత్యేకమైన యోగాసనాలు, ప్రత్యేకమైన ఆహార నియమాలు, ప్రత్యేకమైన అవగాహన తరగతులు, ఇంటికి వెళ్ళిన తరువాత ఆచరించవలసిన జీవన విధానం పూర్తిగా నేర్పిస్తారు.

ఆరోగ్య శిబిరం హాజరు కావాలంటే? ఇప్పుడు చేరండి

రోజువారీ ఆరోగ్య దినచర్యలు

  • ఉదయం యోగ సెషన్

    రోజువారీ యోగ తరగతులు, వ్యాయామాలు, ప్రాణయామ, ఆసనాలు శిక్షణ.

  • మానసిక ఆరోగ్య అభివృద్ధికి

    మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి, పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవడానికి,
    మానసిక ఆరోగ్య అభివృద్ధికి డాక్టర్ విశాలగారి మంచిమాట ఉంటుంది.

  • మధ్యాహ్నం వంట తరగతులు

    ఆసక్తి కలవారు నూనె లేకుండా వంట గురించి తెలుసుకోవచ్చు. ప్రత్యక్షముగా ఆరోగ్యకరమైన వంట సెషన్స్ రోజూ నిర్వహిస్తారు.

  • డాక్టర్ గారి ఆరోగ్య ప్రసంగం

    ఇందులో అరగంట ప్రశ్నలు-సమాధానాలు, రోజుకి ఒక ఆరోగ్య అంశం పైన డాక్టర్ గారి ప్రత్యేక లెక్చర్ ఉంటుంది.

ఆరోగ్యాలయ ముఖ్య సభ్యులు

డా. మంతెన సత్యనారాయణ రాజు

ఫౌండర్ మరియు మేనేజింగ్ ట్రస్టీ

డా. గోకరాజు గంగరాజు

ట్రస్టీ, ఆరోగ్యాలయం దాత

డా. బైరీ శ్రీనివాస్

మెడికల్ సూపరింటెండెంట్

డా.శ్రీనివాసరెడ్డి

చీఫ్ మెడికల్ ఆఫీసర్

వార్తలు మరియు తాజా విషయాలు

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).

  • మా డాక్టర్ నుండి ఉచిత ఫోన్ సంప్రదింపులకు +91 9848021122 కాల్ చేయండి( 7 am నుండి 9pm వరకు)
  • విజయవాడ ఆరోగ్యాలయం

    • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.