ఆరోగ్యం అంటే ఏ జబ్బూ లేని స్థితి మరియు ఏ జబ్బూ రానివ్వని స్థితి. అలాంటి ఆరోగ్యం పొందాలంటే మంచి గాలి, సరిపడా నీరు, సరైన ఆహారం, కనీస వ్యాయామం, సరైన విసర్జన, ఉపవాసం, అవసరమైనంత విశ్రాంతి ma అవసరం. ఈ ఏడు అవసరాలను అభిరుచులకు అనుగుణంగా కాకుండా సమతుల్యంగా అందించే విధంగా మన దినచర్య ఉండాలి. ప్రకృతిజీవన విధానంలో రోగాలు తగ్గించడానికి ఏవిధమైన మందులు ఉండవు. సరైన నియమాలే ఆరోగ్యం.
ఈ దినచర్య ఆరోగ్యాలయంలో తెల్లవారుఝామున ప్రారంభించ బడుతుంది.
ఉదయం 4:25 – నిద్రలేవడం. ప్రతీ గదిలోనికి ఆధ్యాత్మిక కీర్తనలు మైక్ లో వినిపించడం ద్వారా మేలుకొలుపు జరుగుతుంది.
4:25-4:55 వరకు మొదటి విడత నీరు (1.5 లీ) త్రాగి మలవిసర్జన చేసి కాలకృత్యాలు తీర్చుకోవాలి.
5:00-6:30 వరకు యోగా తరగతి ఉంటుంది. ఇందులో వార్మింగ్ అప్ ఎక్సెర్సైజులు, ప్రాణాయామం, ఆసనాల శిక్షణ ఇస్తారు.
6:30-6:45 వరకు యోగక్రియలు ఉంటాయి. వీటిలో జలనేతి, సూత్రనేతి, గజకర్ణి (పొట్ట శుభ్రపరచడం)నేర్పిస్తారు.
6:45-7:15 వరకు రెండవసారి నీరు (1.5 లీ వరకు) త్రాగడం, రెండవసారి మలవిసర్జన ఉంటాయి.
7:15-8:15 వరకు అల్పాహారం. ఇందులో ఐదు రకాల మొలకెత్తిన విత్తనాలు, లేత కొబ్బరి, ఖర్జూరపండ్లు, మరియు పండ్లు అల్పాహారంగా ఇవ్వబడతాయి. నమల్లేని వారికి ఉడికించిన గింజలు, రాగి జావ ఇవ్వబడతాయి.
8:15-8:45 వరకు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి, సానుకూల దృక్పథం(పాజిటివ్ థింకింగ్) అలవర్చుకోవడానికి, మానసిక ఆరోగ్య అభివృద్ధికి డాక్టర్ విశాలగారి మంచిమాట ఉంటుంది. ఆశ్రమ సిబ్బంది కూడా ఈ కార్యక్రమం విన్నాకా విధులకు హాజరు అవుతారు.
9:00-12:00 వరకు చికిత్సలు(ట్రీట్మెంట్స్) ఉంటాయి. వీటిలో ఫుల్ బాడీ మసాజ్, పార్షల్ మసాజ్, స్టీమ్ బాత్, అండర్ వాటర్ మసాజ్ మొదలైనవి ఉంటాయి. వీటి మధ్యలో ఆడవారికి కృష్ణా నదిలో ఈత నేర్పబడుతుంది.
మధ్యాహ్నం 12:00-1:00 వరకు మధ్యాహ్న భోజనం. ఇందులో పుల్కాలు, ముడిబియ్యపు అన్నం,రెండు రకాల కూరలు మరియు ఆవుపెరుగు ఉంటాయి.
1:00-2.00 వరకు విశ్రాంతి సమయం. ఈ సమయం లో ఆసక్తి ఉన్నవారికి ఉప్పు, నూనె లేని వంట అవగాహన ఉంటుంది.
2:00-4:00 వరకు చికిత్సలు(ట్రీట్మెంట్స్) ఉంటాయి. వీటిలో మడ్ బాత్, శాండ్ బాత్, సన్ బాత్, అరిటాకుల బాత్, చెస్ట్ ప్యాక్, నీమ్ ప్యాక్, నీమ్ బాత్ మరియు మగవారికి ఈత ఈ సమయంలో జరుగుతాయి.
4:30-5:30 వరకు క్రొవ్వు, పొట్ట, బరువు, సీటు కరగడానికి ప్రత్యేక ఊబకాయం వ్యాయామం(ఒబేసిటీ ఎక్సెర్సైజులు), ఆసనాలు ఉంటాయి.
సాయంత్రం 5:30-6:15 వరకు కృష్ణా నదిలో పెడల్ బోటింగ్ చేయవచ్చు.
6:15-7:00 వరకు రాత్రి భోజన సమయం. ఇందులో పుల్కా, పచ్చడి, కూర, పెరుగు లేదా ఐదు రకాల పండ్లు ఇవ్వబడతాయి.
7:00-8:30 వరకు డాక్టర్ గారి ఆరోగ్య ప్రసంగం ఉంటుంది. ఇందులో అరగంట ప్రశ్నలు-సమాధానాలు, అపోహలు, సందేహ నివృత్తి ఉంటాయి. మిగిలిన అరగంట రోజుకి ఒక ఆరోగ్య అంశం పైన డాక్టర్ గారి ప్రత్యేక ఉపన్యాసం ఉంటుంది.
8:30-9:00 వరకు కాలక్షేప సమయం.
9 గంటల తరవాత నిద్రకి ఉపక్రమించాలి.
Call Us Today : +91-863-2333888
msrct.reception@gmail.com