ప్రకృతి జీవన విధానం-అనుసరించండం-ఎలా

కొద్దికొద్దిగా మొదలుపెట్టి రోజుకి 5-6 లీ నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి.
1. ఉదయం 4-5 గంటలమధ్య లేచి బ్రష్ చేసికొనగానే ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ల నీరు త్రాగాలి. ఒక్కసారిగా త్రాగలేనివారు 4-5 నిమిషాల వ్యవధిలో త్రాగవచ్చు.
2. నీరు త్రాగిన కొన్ని నిమిషాలకు మొదటిసారి మలవిసర్జన చేయాలి.
3. ఒక గంట సమయం వ్యాయామం చేయాలి. ఇందులో ఎక్సెర్సైజులు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. (వ్యాయామ రహస్యం వీడియో చూసి నేర్చుకోవచ్చు)
4. మొదటి సారి నీరు త్రాగిన గంటన్నర వ్యవధి తరవాత రెండవ దఫా ఇంకో లీటరు నుండి లీటరున్నర నీరు త్రాగాలి. తిరిగి మలవిసర్జన చేయాలి. రెండుసార్లు నీరు త్రాగడం వలన సుఖంగా విరేచనం అవుతుంది.
(కొత్తగా మొదలు పెట్టిన వారు మలబద్ధకం ఉన్నట్లయితే ఎనీమా చేసుకోవచ్చు. సుఖవిరోచన రహస్యంవీడియో ఉపయోగపడుతుంది)
5. రెండవ దఫా నీరు త్రాగిన అరగంట తరువాత వెజిటబుల్ జ్యూస్, తేనె-నిమ్మరసం, పండ్లరసం, కొబ్బరినీరు లలో ఏదో ఒకటి త్రాగడం మంచిది. సుగర్ వ్యాధి ఉన్నవారు పండ్ల రసం తప్ప మిగిలినవాటిలో ఏదైనా
త్రాగొచ్చు.
6. వెజిటబుల్ జ్యూస్ త్రాగిన ఒక గంట తరువాత అల్పాహారం తినవచ్చు. మొలకెత్తిన గింజలు(పెసలు, బొబ్బర్లు, శెనగలు, సజ్జలు, గోధుమలు, ఉలవలు,రాగులు మొదలైనవి), ఖర్జూరాలు, ముప్పెట కొబ్బరిలను తినగలిగినంత తినచ్చు.
7. భోజనానికి ఒక గంట ముందు అర లీటరు నుండి ఒక లీటరు వరకు నీరు త్రాగాలి.
8. మధ్యాహ్న భోజనంలో ఉప్పు, నూనె లేకుండా కూర వండుకుని దానితో ముడిబియ్యం అన్నం కానీ, ఆడించిన పిండితో చేసిన పుల్కాలు కానీ తినాలి. అలాగే సుగర్, అధిక బరువు ఉన్నవారు జొన్న, సజ్జ
రాగి రొట్టెలు తినడం వలన బరువు, సుగర్ తగ్గుతాయి.
9. మధ్యాహ్న భోజనం చేసిన రెండుగంటల తర్వాత 4:30-5:00 వరకు అంచెలంచెలుగా 4-5 గ్లాసుల నీరు త్రాగడం మంచిది. సుగర్ ఉన్నవారు, నీరసంగా ఉన్నవారు ఈ సమయంలో కొబ్బరి నీరు త్రాగడం కూడా
మంచిది. ఇతరులు చెరకురసం లేదా పండ్ల రసం త్రాగవచ్చు.
10. 6:30- 7:00 సమయంలో రాత్రి డిన్నర్ చేయడం చాలా మంచిది. డిన్నర్ లో పండ్లు (నాలుగైదు రకాలు) కానీ, లేదా నూనె, ఉప్పు లేని కురతో 3-4 పుల్కాలు కానీ తినాలి.
11. సాధ్యమైనంతవరకు 10 గంటల లోపు పడుకోవడం శరీర ఆరోగ్యానికి మంచిది. 7-9 గంటల నిద్ర శరీరానికి అవసరం.

మమ్మల్ని సంప్రదించాలంటే:

మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).

విజయవాడ ఆరోగ్యాలయం

  • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా(ఆంధ్ర ప్రదేశ్), భారతదేశం, పిన్ కోడ్: 522237.