ఆరోగ్యాన్ని మనం పొందాలంటే, అవసరాలు 7 అవి: 1. మంచి గాలి 2. సరిపడా నీరు 3. సరైన ఆహరం 4. సరిపడా వ్యాయామం 5. సరైన విసర్జన 6. సరిపడా విశ్రాంతి 7. ఉపవాసం
గాలి: మన శరీరానికి ప్రాథమిక అవసరం గాలి. ప్రకృతి జీవరాశికి ఇచ్చిన ఒక వరం. మన ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ శ్వాసక్రియ. ఆడవిలోని జంతువులన్నీ స్వచ్చమైన గాలిని పిలుస్తుంటే మనం కలుషితమైన గాలితో జీవనం సాగిస్తున్నాం.
నీరు: మనకి రెండవ అవసరం నీరు. గాలి మన ప్రమేయం లేకుండా శరిరానికి అందించబడుతుంది కానీ నీరు మనం శరిరానికి అవసరమైనంత పరిమాణంలో, అవసరమైన సమయంలో అందించవలసి ఉంటుంది. ప్రకృతి లో 3/4 భాగం నీరు, 1/4 భాగం నేల ఉన్నట్టు మన శరిరానికి కూడా 68% నీరు, 32% పదార్థం అవసరం.
ఆహరం: ప్రపంచంలోని జీవరాశులన్నిటికీ వాటి శరీరపరిమాణం, శరీరతత్వం బట్టీ వాటి ఆహరం నిర్ణయించబడింది. మూగ జీవులన్నీ ప్రకృతి నియమాలను ఆచరిస్తుండగా, తెలివి అయిన మనిషి మాత్రం తీసుకోవలసీన పద్దతిలో మాత్రం ఆహరం తీసుకొవట్లేదు. కొన్నిరోజుల పాటు ఆహరం లేకుంద జీవించగల మనం గాలి, నీరు కంటే ఆహరానికి మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నాం.
మంతెన సత్యనారాయణరాజు గారు శరీరానికి అవసరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మసాలా, నూనె, పంచదార, ఉప్పు(moss) లేకుండా రుచికరంగా తయారు చేసుకునే విధానాన్ని ప్రకృతి జీవనవిధానం ద్వారా మనకు అందించారు.
వ్యాయామం: ప్రకృతిలోని మిగిలిన జీవరాసులు అన్నీ శారీరక శ్రమ లేకుండా అహారాన్ని పొందవు.వేటాడీ అహారాన్ని సంపాదించడంలోనే వాటి శరీరాలకు తగిన వ్యాయామం అవుతుంది. మనిషి మాత్రం మూడు పూటలా ఆహారం తింటూ ఏవిధమైన శరీరక శ్రమ చేయకపోవడం వల్ల ఆనారోగ్యాలు వస్తున్నాయి.
మంతెన రాజుగారు ఆశ్రమంలో మనిషి జీవన శైలికి అవసరమైన వ్యాయామాలు డిజైన్ చేశారు.
విసర్జన: మనం తినే అహారం శరీరంలో రకరకాల జీవక్రియలను చేసుకుని శక్తిగా మార్చి శరీరభాగాలకు అందించగా మిగిలిన వ్యర్ద పదార్థాలు బయటకి విసర్జించబడతాయి. ఈ వ్యర్ద పదార్థాలు ఘన(విరోచనం) ద్రవ(మూత్రం,చమట), వాయు(కార్బన్ డయాక్స్తెడ్) పదార్థాలుగా శరీరం నుండి బయటకు పంపబడతాయి. మనిషి తప్ప మిగిలిన జంతువులన్నీ ఎక్కడైన ఎప్పుడైన, విసర్జన చేస్తాయి. అవి శరీరభాగాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటాయి. మనం సమయ నియమాలు పాటించకుండా తిసే ఆహారం వల్ల, జీర్ణక్రియ సరిగా జరగక ప్రేగులలో వ్యర్ధపదార్థాలు ఉండిపోవడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. సుఖవిరోచనం కలగాలంటే తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టవలసినదే.
విశ్రాంతి: సరిగ్గా నిద్ర పోతే ఎముకలు, కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది. కానీ విశ్రాంతి అంటే 7-8 గంటలు నిద్ర మాత్రమే కాదు. శరీరంలోని జీర్ణావయవాలకు కూడా విశ్రాంతి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.ఆహారం తినడంలో నియమాలను సక్రమంగా పాటించడం వల్ల జీర్ణవ్యవస్ధకి సరయిన విశ్రాంతి దొరికి బాగా పనిచేస్తుంది.
ఉపవాసం: శరీరంలో నిరంతరం కొన్ని కణాలు నాశనం అవుతూ, కొత్తకణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. శరీరం రాత్రి పూట వ్యర్ధాలను శుభ్రం చేసే పని చేసుకుంటూ ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారానికి ఒకరోజు విశ్రాంతి ఇవ్వడమే ఉపవాసం. మిగిలిన రోజులలో శరీరం 12 గంటలు కణాల బాగుకి కేటాయిస్తే ఉపవాస సమయంలో 24 గంటలూ కేటాయించగలుగుతుంది. ఉపవాసం ఎలా చేయాలో తెలియక చాలా మంది రకరకాల ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొందరు టీ, కాఫీలు తాగుతూ, కొందరు పండ్లు తింటూ ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసం అంటే నీరు తప్ప శరీరనికి వేరే ఏ ఆహార పదార్దామూ అందించకుండా ఉండడం. పూర్తి శక్తి అంతా శరీరాన్ని బాగు చేయడానికే వినియోగించుకునేలా చేయడం.
Call Us Today : +91-863-2333888
msrct.reception@gmail.com