[rev_slider_vc alias=”naturopathy-slider”]

 • పంచభూతాలైన గాలి, నీరు, భూమి, అగ్ని మరియు ఆకాశంలతో కూడిన ఆహారపు అలవాట్లను మార్చుకునే నివారణ ప్రక్రియే ప్రకృతి జీవన విధానం.

ప్రకృతి వైద్య విధానం అంటే

ఆయుర్వేద, అలోపతి, హోమియోపతి, యునాని, సిద్ధ వైద్య విధానం మొదలగు వైద్య విధానాలవలే ఇది ఒక వైద్య విధానం. పంచభూతాలతో చికిత్స చేసే ఒక ప్రక్రియ. ఇందులో మందులు కానీ, పసర్లు కానీ, పూతలు కానీ, లేపనాలు కానీ ఏమీ వుండవు. ఈ ట్రీట్మెంట్స్ మందుల్లేకుండా జబ్బులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ వైద్య విధానంలో ట్రీట్మెంట్స్ – వాటర్ థెరపీ, ఫాస్టింగ్ థెరపీ, డైట్ థెరపీ, యోగా థెరపీ, మసాజ్ థెరపీ, మడ్ థెరపీ, సన్ లైట్ థెరపీ మొదలగు థెరపీలు వుంటాయి.

మంతెన గారి జీవనశైలి

శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీ రామరాజు గార్ల ద్వితీయ సంతానమైన సర్వశ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏప్రిల్ 23, 1967 న గుంటూరు జిల్లా , బాపట్ల తాలూకా, పిట్టలవాని పాలెం మండలంలోని అలాకాపురం అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లితండ్రులకి ఈ వైద్య విధానం పట్ల స్పష్టమైన అవగాహన ఉండటంతో మంతెన గారి చిన్నప్పటి నుంచి ఆహార క్రమశిక్షణ ఉండటంతో ఈ ప్రకృతి వైద్య విధానం అలవటైందని చెప్పుకోవచ్చు.

యోగా గురు

శరీరక శ్రమ లేకుండా ఆరోగ్యం కావాలనుకోవడం అత్యాశే అవుతుంది. శరీరం కదలకుండా, సుఖంగా ఉండే తీరుని ఆసనం అంటారు. యోగాసనాలనేవి మనిషి శరీరం, మనస్సు, చైతన్యాల కలయిక. యోగా ముఖ్య ఉద్దేశ్యం ఈ మూడింటినీ సమన్వయ పరిచి దాని ద్వారా సమతుల్యాన్ని సాధించడం. యోగాసనంలో మనస్థితి, శ్వాస మీద ధ్యాస, కండరాల కదలికల పై మనసుని లగ్నం చేయాలి. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం సంపూర్ణంగా లభిస్తుంది.

సూర్యాహారం

ప్రకృతి సిద్ధమైన అర్కపక్వాహారం ఆరోగ్యానికి సోపానం. మనమంతా రుచులకి అలవాటుపడి వండిన ఆహారాన్ని తింటున్నాం. పూర్తిగా సహజాహారాన్నితినలేకపోతే ఉప్పు, నూనెల్లేకుండా వండుకున్న ఆహారం శరీర ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తుంది. పైపెచ్చు, ఉప్పు, నూనెల్లేని పోషకాలు నష్టపోని ఆహారపదార్థాలు వండుకోవటం సులభం.

ప్రకృతి వైద్యం – ఏడు ముఖ్యాంశాలు

 • గాలి

 • నీరు

 • ఆహారం

 • వ్యాయామం

 • విసర్జన

 • విశ్రాంతి

 • ఉపవాసం

సహజ జీవనశైలి యొక్క అద్భుతమైన నివారిణులు

 • మధుమేహం
 • ఊబకాయం
 • రక్తపోటు
 • థైరాయిడ్
 • కీళ్ల నొప్పులు
 • సోరియాసిస్ – చర్మ వ్యాధులు
 • మలబద్ధకం – పైల్స్
 • ఆస్త్మా, ఆయాసం, కఫ సమస్యలు

డాక్టర్ రాజు గారి సహజ జీవన బ్లాగులు

  మరిన్ని వివరాలకు -మీ ప్రశ్నలు సంధించండి

  మమ్మల్ని సంప్రదించాలంటే:

  మరిన్ని వివరాలకు ఉచితంగా సంప్రదించండి:

  • ఉదయం 6:30 నుండి సాయంత్రం 8:30 వరకు (భారత కాలమానం ప్రకారం).
 • విజయవాడ ఆరోగ్యాలయం

  • 3-185, అమరావతి కరకట్ట రోడ్, వెంకట పాలెం పోస్ట్, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్: 522237.